నర్సంపేటలో రక్తదాన శిబిరం విజయవంతం

నర్సంపేట జులై26( నమస్తే భారత్ ) :
నర్సంపేట పట్టణం సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ శతాబ్ది వసంతాల సంబరాల సందర్భంగా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరము విజయవంతం అయింది. ఈ రక్తదాన శిబిరాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.భార్గవ్, సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గొంగళ్ళ అశోక్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) ప్రారంభించారు.డాక్టర్ టి.భార్గవ్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం రక్తదానం చేసిన రక్తదాతలను అభినందించారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొని, యువత ఆదర్శంగా ఉండాలని, రక్తదానం చేసిన రక్తదాతలను నిర్వాహకులు బ్లడ్ సెంటర్ నిర్వాహకులు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గొంగళ్ళ అశోక్, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్, వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) , గొంగళ్ళ రాణి, రక్తదాతలు తోట రవి, చేపూరి ప్రశాంత్, జ్యోతుల నగేష్ , సురేష్, రాకేష్, రాము, రాజు, అజయ్, శ్రీకాంత్, సతీష్, కార్తీక్, రామ్ చరణ్, శివమణి, బ్లడ్ బ్యాంక్ ల్యాబ్ టెక్నీషియన్ నాంపల్లి శ్రీనివాస్, స్టాఫ్ నర్స్ హిమబిందు, స్వామి, రక్తదాతలు పాల్గొన్నారు.



