కొండ ఉప్పలమ్మకు
ఘన నివాళి.
సిఐటియు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పాలడుగు భాస్కర్
నమస్తే భారత్ :-మరిపెడ
సిఐటియు మహబూబాద్ జిల్లా నాయకులు భవన నిర్మాణ కార్మిక సంఘం మాజీ జిల్లా అధ్యక్షులు కొండ ఉప్పలయ్య సతీమణి కొండ ఉప్పలమ్మ (52) అకాల మరణం పొందడం బాధాకరమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర కార్యదర్శులు వంగూరు రాములు, జె వెంకటేష్, లు తెలిపారు. మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో ఆదివారం ఆమే పార్దేహానికి సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. కొండ ఉప్పలయ్య ధైర్యంగా ఉండాలని కుటుంబ బాగోగులు చూసుకోవాలని నాయకులు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ దుండి వీరన్న, కెవిపిఎస్ జిల్లా నాయకులు జిన్నా లచ్చయ్య, రైతు సంఘం నాయకులు నందిపాటి వెంకన్న, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు



