*వెల్ జర్ల రైతు వేదికలో కేంద్ర ప్రభుత్వ నూతన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై రైతులకు.డీలర్లు వాలంటీరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది*
నమస్తే భరత్ షాద్ నగర్ జూన్ 15:మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమారు మాట్లాడుతూ ఈ ఫెర్టిలైజట్ బుకింగ్ యాప్ వల్ల అందరూ రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉంచడం మరియు ఎరువుల పారదర్శకంగా పంపిణి జరుగుతుంది రాష్ట్ర స్థాయి లో రైతులకు ఈ ఫర్టిలైజర్ అప్ పై సందేహాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800237157 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులో ఉంచడం జరిగింది మరియు
ప్రతి డీలర్లు షాప్ వద్ద ఇద్దరూ వాలంటీరులను ఉంచడం జరిగింది మరియు ప్రతి గ్రామంలో ముగ్గురు వాలంటీరిలకు అవగాహనా కల్పించి అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా ప్రతి రైతు వేదికలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు ఫర్టిలైజర్ యాప్ పై ఉన్న సందేహాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది అని తెలిపాడు.ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్‌పై రైతులకు ,డీలర్లు కు మరియు వాలంటీరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమములో మండల వ్యవసాయ అధికారి నిశాంత్ కుమార్ ,వ్యవసాయ విస్తరణ అధికారులు గోవర్ధన్ ,మహేందర్ మరియు రైతులు ,డీలర్లు పాల్గొన్నారు.

