*భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు)*
*తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత సమావేశాలను జయప్రదం చేయండి.*
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎన్ రాజు పిలుపు*
నమస్తే భారత్ షాద్ నగర్ జూన్15:ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండగా పనిచేస్తూ సమ సమాజం నిర్మాణం కోసం శ్రామిక ప్రజల విముక్తి కోసం, కష్ట జీవుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత సమావేశాలు 2026-జూన్ 16,17 తేదీలల్లో రంగారెడ్డి జిల్లా, కొత్తపేట్ బాబు జగ్జీవన్రావు భవన్ లో నిర్వహిస్తున్నామని దీనికి షాద్నగర్ ప్రాంతంలో ని ఎక్కువ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వచ్చారు.షాద్ నగర్ పట్టణంలో సోమవారం రోజు యువ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించిన అనంతరం ఎన్ రాజు మాట్లాడుతూ అప్రజాస్వామిక పద్దతుల్లో రాజకీయాలు చేస్తున్న బిజెపి మాతాల మధ్యచిచ్చు రాజేస్తున్నది. కులాల మధ్య తగదాలు రేపుతున్నది. తన రాజకీయ లబ్ధికోసం అల్లర్లు సృష్టిస్తున్నది. ఇది ధర్మం కాదు. భారతదేశపు ప్రజాస్వామిక రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేసి మన దేశంలో మతం పేరుతో ఒక నిరంకుశ పాలనను ముందుకు తెచ్చింది.కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ కంపెనీలకు పన్నును 33 శాతం నుండి 25 శాతానికి తగ్గించింది. ఏ దేశంలోను ఇంత తక్కువ పన్నులు లేవు. ఈ విధానం కార్పోరేట్లకు స్వర్గం- సామాన్యులకు నరకంలా మారింది. అంతేగాక కొద్ది మంది శత కోటిశ్వరులకు పన్ను రాయితీ రూపంలో 55 లక్షల కోట్లు ముట్టచెప్పింది. సెస్స్,జి ఎస్ టి పేరుతో డిజిల్, పెట్రోల్, గ్యాస్ వంటి నిత్యవసర సరుకులపై అధిక భారాలు మోపుతున్నది. ఇలా కార్పోరేట్ల ప్రయోజనాల కోసం దేశానికి వెన్నెముక అయినా రైతాంగాన్ని బలిచేస్తున్నది. భగ్నమైన యువత స్వప్నాలు దిగజారుతున్నాయి. నిరుద్యోగ సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. భారత దేశాన్ని కొల్లగొడుతున్న బడా వ్యాపారులు ఆధాని, అంబానిలతో మోడి బంధం బలపడగా వేతనాల కుదింపుతో కార్మిక వర్గం ఆధునిక భానిసత్వంలో కురుకుపోయేల చేసింది. అంతులేని అవినీతి, విస్తరించిన మాఫియా వంటి సమస్యలు, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం ప్రజల పక్షాన దేశ ప్రయోజనాలకోసం పోరాడుతున్నది సిపిఐ(ఎం)అని,
రంగారెడ్డి జిల్లా డిండి శివన్నగూడ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపులతో పాటు విద్య వైద్యం రామోజీ ఫిలిం సిటీ సాహెబ్ నగర్ ఫ్యాబ్సిటీ కందుకూర్ తదితర ప్రాంతాల్లో ఇండ్ల స్థలాల కోసం చేవెళ్ల మంచాల షాద్నగర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం పోరాడుతున్నది అనాజ్పూర్ కప్పపాడు సీలింగ్ భూములు రంగాపూర్ పోడు భూములపై ప్రజల హక్కుల కోసం ఉద్యమిస్తున్నది సిపిఎం పార్టీ. గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, త్రిబుల్ ఆర్ రోడ్డు, ఫార్మాసిటీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఫ్యూచర్ సిటీలో రోడ్ల నిర్మాణం కోసం బలవంతపు భూసేకరణ ఆపాలని ఫార్మాసిటీ నిషేధిత జాబితాలో ఉన్న రైతుల పేర్లను ఆ జాబితా నుండి తొలగించాలని ప్రభుత్వ పోరంబోకు సీలింగ్ పోడు భూములు గతంలో రక్షిత కౌలుదారులు పోరాడే సాధించుకున్న భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నది ఉపాధి హామీ పథకాన్ని నిర్వర్యం చేసే కొత్త చట్టాన్ని రద్దుచేసి పెండింగ్ బిల్లులో ఇవ్వాలని కోరడమే కాక అరోలైన వారందరికీ రేషన్ కార్డులు పెన్షన్లు ఇవ్వాలని మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలను ఖండిస్తూ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతున్నది సిపిఎం ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది ఎకరాల భూమిని కార్పొరేట్ కంపెనీలకు ఈ మధ్యకాలంలో కేటాయించిందని అభివృద్ధి పేరుతో రైతుల నుండి వందలాది ఎకరాల భూమిని బలవంతంగా తీసుకొని కార్పొరేట్లకు అప్పజెప్పాలని చూస్తున్నదని ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు సన్నదత లో భాగంగా రంగారెడ్డి జిల్లా కొత్తపేట బాబు జగ్జీవన్ రావ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర యువ కార్యకర్తల విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నాం ఈ సమావేశాల్లో జయప్రదానికి కార్యకర్తలు యువ కులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో షాద్ నగర్ టౌన్ కార్యదర్శి శ్రీను నాయక్, కొత్తూరు మండల కార్యదర్శి బిసా .సాయిబాబు, నందిగామ మండల కార్యదర్శి కొంగరి నర్సింహులు, టౌన్ నాయకులు కే రాజు, ముఖిత్, ఎస్ఎఫ్ఐ నాయకులు,సి ఐ టి యూ సభ్యుడు విజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

