ePaper
Friday, June 12, 2026
ePaper
Homeఎడిటోరియల్మానుకోటలో రాంప్రసాద్ బిస్మిల్‌కు ఘన నివాళులు

మానుకోటలో రాంప్రసాద్ బిస్మిల్‌కు ఘన నివాళులు

📰 Generate e-Paper Clip

మానుకోటలో రాంప్రసాద్ బిస్మిల్‌కు ఘన నివాళులు

డాక్టర్ కందుల నాగరాజు

నమస్తే భారత్:-మహబూబాబాద్

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ (HRA) వ్యవస్థాపకుడు, కాకోరి ఉద్యమ వీరుడు పండిట్ రాంప్రసాద్ బిస్మిల్ 129వ జయంతిని నేతాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బిస్మిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమితి వ్యవస్థాపకుడు డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల్లో రాంప్రసాద్ బిస్మిల్ ఒకరని అన్నారు.
బిస్మిల్ జీవితంలో హిందూ–ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన అష్ఫాఖుల్లా ఖాన్‌తో ఆయనకు ఉన్న స్నేహం భారత చరిత్రలో చిరస్మరణీయం.
మతాలు వేరైనా, దేశభక్తి అనే ఒకే లక్ష్యంతో ఇద్దరూ చేయి చేయి కలిపి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు పేరు.
మైన్‌పురి కుట్ర కేసు (మైంపూరి కన్స్పిరేసీ కేసు ) ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యకలాపాలను నిర్వహించిన బిస్మిల్, అనంతరం హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించి యువతలో జాతీయ చైతన్యాన్ని రగిలించారు.
ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా అనేక మంది యువకులను సమీకరించి స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలోపేతం చేశాడు.
1925లో జరిగిన చారిత్రాత్మక కాకోరి రైలు ఘటనలో (కాకోరి ట్రైన్ యాక్షన్ ) బ్రిటిష్ ప్రభుత్వ ఖజానాను స్వాధీనం చేసుకుని సామ్రాజ్యవాద పాలనకు సవాల్ విసిరిన విప్లవకారుల్లో బిస్మిల్ ప్రధాన పాత్ర పోషించాడు. ఆ ఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక కీలక మలుపుగా.నిలిచింది.హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ దేశభక్తి కలిగిన యువతను విపరీతంగా.ఆకర్షించింది ,తరువాత కాలంలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవ నాయకుల ఎదుగుదలకు ఈ సంస్థ బలమైన పునాది వేసింది. అనంతరం ఇదే సంస్థ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (HSRA)గా రూపాంతరం చెంది స్వాతంత్ర్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది.సర్ఫరోషీ కి తమన్నా అబ్ హమారే దిల్ మే హై అనే బిస్మిల్ అమర నినాదం కేవలం ఒక కవితా పంక్తి మాత్రమే కాదని, దేశం కోసం సర్వస్వం అర్పించాలనే సంకల్పానికి ప్రతీక అని అన్నారు. నేడు అదే స్ఫూర్తి, అదే దేశభక్తి, అదే త్యాగనిరతి మానుకోట పౌరుల గుండెల్లో ఉందని డాక్టర్ నాగరాజు చెప్తూ బిస్మిల్ కీర్తిని కొనియాడాడు..
ఈ కార్యక్రమంలో నేతాజీ సేవా సమితి ప్రధాన కార్యదర్శి కుదురుపాక వివేక్, ఆర్గనైజింగ్ కన్వీనర్ సామ శ్రీనివాస్, సభ్యులు చిట్టిమల్ల రఘు, షేక్ యూసఫ్,శ్రీరంగం శోభన్ బాబు, గట్టు శ్రీనివాస్, శ్రీధర్, పెండ్యాల రఘునాథ్,ఎర్రోజు కృపాకర్,
బానోతు వాచ్య, మాజీ సైనికుడు తండా సత్యనారాయణ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!