ePaper
Wednesday, August 26, 2026
ePaper
Homeఎడిటోరియల్ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

📰 Generate e-Paper Clip

ఫీజుల బకాయిలు వెంటనే విడుదల చేయాలి

-“ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరిట బీజేవైఎం నిరసన

-ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

-విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

-విద్యార్థుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని బీజేవైఎం స్పష్టం

-ప్రభుత్వ నిర్లక్ష్యంపై నాయకుల ఆగ్రహం

-రాష్ట్ర బీజేవైఎం మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్‌తో పాటు హాజరైన పలువురు నాయకులు

 

కుత్బుల్లాపూర్, జూలై 30 ( నమస్తే భరత్ ): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో “ఫీజుల బకాయి – బీజేపీ లడాయి” పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఉన్నత విద్యను కొనసాగించేందుకు ప్రభుత్వం అందించాల్సిన ఆర్థిక సహాయం ఆలస్యం కావడం వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం బీజేవైఎం పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేవైఎం మీడియా కన్వీనర్ నాగదీప్ గౌడ్తో పాటు రావుల పృథ్వి కుమార్, శ్యామ్ కిరణ్ రెడ్డి, శ్రీనాథ్, మంజునాథ్ తదితర బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!