అనారోగ్యంతో ఉన్న గ్రామ పార్టీ అధ్యక్షులు వెంకన్న ని మరియు ఎండి రాజియా ని పరామర్శించిన

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటయపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోకాటి వెంకన్న మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి మస్తాన్ సతీమణి రాజియా అనారోగ్యంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా, పాలకుర్తి.శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి వారి నివాసానికి.వెళ్లి.పరామర్శించారు.ఈ సందర్భంగా వెంకన్న మరియు రాజియా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ధైర్యం చెప్పి మెరుగైన వైద్య చికిత్స అందించుకోవాలని సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు.తదితరులు పాల్గొన్నారు.



