ePaper
Monday, September 14, 2026
ePaper
Homeఎడిటోరియల్షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ఐవి /ఎయిడ్స్

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ఐవి /ఎయిడ్స్

📰 Generate e-Paper Clip

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన హెచ్ఐవి /ఎయిడ్స్

తెలంగాణ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 07:గురువారం షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని తను తెలంగాణ రాష్ట్ర హెచ్ఐవి/ ఎయిడ్స్ కంట్రోల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జయలక్ష్మి సందర్శించారు. షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ మరియు టెస్టింగ్ సెంటర్ డాక్టర్ జయలక్ష్మి సడన్ విజిట్ చేశారు. ఇక్కడ ల్యాబ్ లో గర్భవతులకు మరియు జనరల్ పేషెంట్లకు చేస్తున్న హెచ్ఐవి /ఎయిడ్స్ పరీక్షలను పరిశీలించారు. గర్భవతులు ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షలకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి హెచ్ఐవి పరీక్ష తప్పకుండా చేయాలని తెలియజేశారు. పరీక్షలో పాజిటివ్ వచ్చినప్పుడు, పేషెంట్ కు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చి, ఆ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచాలని చెప్పారు. గర్భవతులకు పాజిటివ్ వచ్చినప్పుడు వారికి తగిన చికిత్స అందించినట్లయితే తల్లి మరియు బిడ్డ క్షేమంగా ఉంటారని తెలియజేశారు. హెచ్ఐవి పరీక్షలను జాగ్రత్తగా నిర్వహించి రిపోర్టులను, రిజిస్టర్లు కచ్చితంగా మైంటైన్ చేయాలని తెలియజేశారు. ల్యాబ్ టెక్నీషియన్ లతో మాట్లాడుతూ పరీక్షలు ఎలా చేస్తున్నారు , ఏ విధంగా రిపోర్ట్ ఇస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. మరియు ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ సెంటర్లో ఉన్న కౌన్సిలర్ శ్యామ్ తో మాట్లాడి అతని యొక్క రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. రిజిస్టర్లలో నెల నెల కన్సాలిడేషన్ రిపోర్ట్స్ కచ్చితంగా రాయాలని కౌన్సిలింగ్ శ్యామ్ కు తెలియజేశారు. హెచ్.ఐ.వి. పాజిటివ్ గలిగిన వ్యక్తులు మందుల కోసం వచ్చిన వారితో డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడి, వారికి మందులు నెల నెల ఇస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసుల అందరికీ తప్పకుండా నెల నెల మందులు అందజేయాలని కచ్చితంగా డాక్టర్ జయలక్ష్మి తెలియచేశారు. రిజిస్టర్లు అన్నీ ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్లో హెచ్.ఐ.ఎమ్.ఎస్ పోర్టల్ లో ఖచ్చితంగా ఎంటర్ చేయాలని చెప్పారు. మంత్లీ టూర్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని, ఐ రిస్క్ ఏరియా ఉన్న దగ్గర మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ హెచ్ఐవి /ఎయిడ్స్ పరీక్షలు నిర్వహించాలని డాక్టర్ జయలక్ష్మి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ విజయలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు, రంగారెడ్డి జిల్లా హెచ్.ఐ.వి ప్రోగ్రాం మేనేజర్ నరేందర్, సూపర్వైజర్ రమేష్ మరియు ఐ.సి.టి.సి కౌన్సిలర్ శామ్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!