కేంద్రంలోని బిజెపి ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ పోరు
బందు మహేందర్ మండల కార్యదర్శి
నమస్తే భారత్ :-తొర్రూర్
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనకు నిరసనగా 6 నుండి14 వరకు సిపిఐ చేసే ప్రచార జాత 10,11 తొర్రూర్ మండల కేంద్రంలో జరిగే ప్రజా చైతన్య ప్రచార పాదయాత్ర ప్రారంభం కానున్నది తొర్రూర్ మండల కార్యదర్శి బందు మహేందర్ పిలుపునిచ్చారు.తొర్రూర్ మండల.కేంద్రంలోని.విశ్రాంతి.భవనంలో.పేరాబోయిన కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన తొర్రూరు మండల ముఖ్య నాయకుల సమావేశంలో బంధు మహేందర్ మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా బిజెపి పాలనలో దేశం మన పెన్నడూ లేని విధంగా నిరుద్యోగిత పెరిగిందని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నింటి సామాన్యుడికి పెను భారమైందని, మోదీ కార్పొరేట్ అనుకూల విధానాల వలన దేశ సంపద కేవలం గుప్పెడు మంది చేతిలో కేంద్రీకృతమై, చదిక శాతం ప్రజల దగ్గర కేవలం కొద్ది సంపద మాత్రమే ఉండడంతో ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోయి ఆకలి, దారిద్రం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రూపాయి విలువ పతనం కావడo, విదేశి మార్గ ద్రవ్య నిల్వలు పడిపోతున్న ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నామని గొప్పలు చెప్పుకోవడం మోడీకి ఆనవాయితీగా మారిందని విమర్శించారు.లక్షలాది మంది రైతులు సుదీర్ఘ పోరాటాలు చేసిన కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కల్పించాలని డిమాండ్ పరిష్కారం కాలేదని, పేదలకు విద్యా, వైద్యం అందని ద్రాక్షగా మారిందని, సంఘటిత రంగ కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు
పోరాటాలు.నిరసనలు.ఆందోళనలతోనే నియంతత్వ విధానాల అవలంబిస్తున్నా మోదీ ప్రభుత్వ మెడలు వంచడానికి ఈనెల 6 నుండి 14 వరకు జరిగే దేశవ్యాప్త ప్రచార జాతాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో సిపిఐ తొర్రూరు మండల సహాయ కార్యదర్శి గణపురం లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ముద్రబోయిన వెంకన్న, వివిధ గ్రామాల శాఖ కార్యదర్శులు బూరుగు యాదగిరి, మందపురి శ్యాంసుందర్, వల్లపు వెంకన్న, అజ్మీర వీరన్న, పసుల యాకయ్య, కోటగిరి కృష్ణ మూర్తి. తదితరులు పాల్గొన్నారు



