సొసైటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వల్లె శ్రీను

ఖానాపురం జూలై3 (నమస్తే భారత్ ) :
వరంగల్ జిల్లా ఖానాపురం మండల సొసైటీ చైర్మన్ గా వల్లె శ్రీనుతో పాటు పర్సన్ ఇంఛార్జీలు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఖానాపురం మండల కేంద్రంలో ని సొసైటీ ఆవరణలో నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, సోసైటీ సీఈవో అంజనేయులు సమక్షంలో సోసైటీ నూతన పాలకవర్గం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులు ,ప్రజాప్రతినిధులు,అభిమానులు చైర్ పర్సన్ వల్లె శ్రీను ,పాలకవర్గ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన చైర్ పర్సన్ వల్లె శ్రీను మాట్లాడుతూ నా పైన నమ్మకంతో నామినేటెడ్ పద్ధతిన ఖానాపురం సోసైటీ చైర్ పర్సన్ గా నియమించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కి ,రాష్ర్ట ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలుతెలియజేశారు.సొసైటీ అభివృద్ది కి కృషి చేస్తూ ప్రభుత్వానికి రైతులకు వారధిలా పని చేస్తానన్నారు. నేను రైతు బిడ్డగా వ్యవసాయరంగంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలను రైతులకు అందెలా చూస్తామన్నారు. నా ఎన్నికకు సహకరించిన మండల కాంగ్రెస్ నాయకులకు ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఆలాగే నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు,సోసైటి పర్సన్ ఇంఛార్జీలు (డైరక్టర్ లు ) బండి వెంకన్న ,శివరాత్రి వెంకన్న, బాషబోయిన రవి ,దేవినేని వేణుగోపాల్ రావు ,బొబ్బ విద్యసాగర్ ,మర్రి ప్రభాకర్ , జట్టంగి నాగారాజు ,ఎర్రరజిత ,లింగిడి వెంకటేశ్వర్లు ,బాల్గు లక్ష్మణ్ , చెడిపాక రజిత ,నూనావత్ భిచ్ఛ్యా ,శాఖమూరి ముఖేష్ చౌదరి (అబ్బులు), ముంజాల రాజేందర్ ,చలిగంటి మల్లిఖార్జున్, బాలుతండా సర్పంచ్ బానోతు సునిత బాలక్రిష్ర్ణ ,వివిద గ్రామాల సర్పంచ్ లు,కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గోన్నారు.



