దళితులైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
డబ్బులు కాజేసిన గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలి
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
నమస్తే భారత్ :-కురవి
దళితులైన అయ్యగారి పళ్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.అయ్యగారి పల్లి గ్రామంలో దళితుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన సిపిఐ బృందం లబ్ధిదారులతో మాట్లాడి ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వoలో అయ్యగారి పెళ్లి గ్రామలో 30 మంది దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరి చేశారు కానీ వాటి నిర్మా ణం పై ఎలాంటి శ్రద్ధ వహించకపోవడం, ప్రతి లబ్ధిదారుల నుండి లక్ష 30 వేల రూపాయలను కాంట్రాక్టర్ ఇప్పించి ఆ ప్రభుత్వ ఆయాములోనే నాలుగేళ్లు పూర్తయిన స్లాబ్ మాత్రమే వేసి వదిలివేయగా లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుత కొంతమంది లబ్ధిదారులు వారి సొంత డబ్బులతో కొంత నిర్మాణం చేపట్టారు మిగతా లబ్ధిదారులు ఆరేళ్లుగా అనేక ఇబ్బందులు పడుతున్న అప్పటి ప్రభుత్వం నిమ్మకం నీరేత్తి ఎత్తినట్టుగా వ్యవహరించగా ఈ ప్రభుత్వ ఆయాలో కొంత నిధులు మంజూరు చేసినా కాంట్రాక్టర్ వాటిని కాజేసి కట్టుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు, బిల్లులు రావడం లేదని దళితులను మోసం చేస్తున్న గుత్తేదారుపై చర్యలు తీసుకొని, కాజేసిన డబ్బులను తిరిగి లబ్ధిదారులకు ఇప్పించే విధంగా, పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించి దళితులను జిల్లా కలెక్టర్ ఆదు కోవాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బుర్ర సమ్మయ్య, తురక రమేష్, బొల్లు వెంకన్న, గజ్జి చంద్రయ్య, కందుల యాకయ్య, జిన్నే సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు



