కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి
.జిల్లా మలేరియా అధికారి కే రజిని
నర్సంపేట జూలై3 (నమస్తే భారత్ ) :
నర్సంపేట డివిజన్ పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖలో పారామెడికల్ సిబ్బంది మరియు ల్యాబ్ టెక్నీషియన్ లకు జిల్లా మలేరియా అధికారి కే రజిని ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని కాలానుగుణంగా సంభవించే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటింటి జ్వర సర్వే నిర్వహించి వ్యాధి ప్రభావిత ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు.ప్రజలకు కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని, దోమ పుట్టకుండా-కుట్టకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో యాంటీ లార్వల్ ఆపరేషన్లు చేపట్టాలని ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలని కోరారు.
ప్రజలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని మరియు నిల్వ ఉన్న ఆహార పదార్థాలను భుజించకుండా తాజా వేడిగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చి వడబోసిన నీటిని త్రాగాలని తెలిపారు.డివిజన్ లోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నమోదైన డెంగ్యూ మలేరియా కేసుల గురించి సమీక్షించి, విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ జేతు రామ్, హెచ్ఈఓ సదానందం, సూపర్ వైజర్లు దామోదర్ రెడ్డి, రాజు, కీర్యా, హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, టీ హబ్ సిబ్బంది పాల్గొన్నారు.



