ePaper
Saturday, October 31, 2026
ePaper
Homeఎడిటోరియల్ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

ధర్మారావుపేట శివాలయం, రామాలయ అభివృద్ధి కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఖానాపురం అక్టోబర్ 30(మల్లేష్ నమస్తే భారత్) :
ఖానాపురం మండలం ధర్మారావుపేట గ్రామంలోని శివాలయం, రామాలయం దేవాలయాల అభివృద్ధి కోసం గ్రామస్తులందరి సహకారంతో, అందరి సమక్షంలో నూతన ఆలయ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గ వివరాలుఇలా ఉన్నాయి.ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గోనె రవీందర్ ,ఉపాధ్యక్షులు లింగ బత్తుల యాక సాయన్న , ప్రధాన కార్యదర్శి చెంచల లక్ష్మీనారాయణ ,
సహాయ కార్యదర్శి జినుకల అశోక్ ,కోశాధికారి: కర్రె రమేష్ ,గౌరవ అధ్యక్షులు:
మాడ్రాజు వెంకన్న (సర్పంచ్) గౌరవ సభ్యులు:
వల్లే శ్రీనివాస్ (సొసైటీ చైర్మన్) కొనుకటి రాజు (ఉప సర్పంచ్)ముఖ్య కార్యవర్గ సభ్యులు:
చెట్టే కుమారస్వామి ,
కొండ వెంకటేశ్వర్లు, ధరంశోతు బాలు,పడకంటి జలేంద్రా చారి , పెరుమాండ్ల సత్యం,బుద్దె తిరుపతి ,
కేళ్లపు శంకరయ్య, అలువాల మదన్ కుమార్ ,ఇంతలా సోమ నరసయ్య , కోదాటి వెంకటేశ్వరరావు,జంగిలి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు గోనె రవీందర్ మాట్లాడుతూ.. గ్రామస్తులు తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ఆలయంలో ఇంకా మిగిలి ఉన్న అభివృద్ధి పనులను గ్రామస్తుల సహకారంతో పూర్తి చేయిస్తానని, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చేలా అవసరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.
గ్రామస్తుల ఐక్యతతో ఆలయాల అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన కమిటీకి ఆలయ అర్చకులు అన్వేష్ శాస్త్రి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!