ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్మౌలిక వసతులతో ఉమామహేశ్వర కాలనీకి కొత్త రూపు కొంపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే...

మౌలిక వసతులతో ఉమామహేశ్వర కాలనీకి కొత్త రూపు కొంపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

📰 Generate e-Paper Clip

మౌలిక వసతులతో ఉమామహేశ్వర కాలనీకి కొత్త రూపు
కొంపల్లి అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

-ఉమామహేశ్వర కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

-భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు

-12 ఏళ్లలో నిరుపేదల జీవన ప్రమాణాల మెరుగుదలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు

-కాలనీవాసుల సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి హామీ

-బోనాల సందర్భంగా నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే

-ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కాలనీవాసులు

కొంపల్లి, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ); కొంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం సీఎంసీ కొంపల్లి సర్కిల్ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీలో ఆయన అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, సీసీ రోడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి భూగర్భ డ్రైనేజీతో పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులను తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ, ఉమామహేశ్వర కాలనీలో అధిక సంఖ్యలో నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయని, గత 12 సంవత్సరాలుగా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కాలనీలో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందని, రానున్న రోజుల్లో కూడా అన్ని సౌకర్యాలతో కాలనీని ఆదర్శవంతమైన నివాస ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు బోనాల పండుగను పురస్కరించుకుని ఉమామహేశ్వర కాలనీలోని నల్ల పోచమ్మ దేవాలయంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. స్థానిక ప్రజల సుఖశాంతులు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ లావణ్య, డీఈలు సామ్రాట్, తిరుపతి, మాజీ మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, మాజీ ఎంపీపీ సన్న కవిత శ్రీశైలం యాదవ్, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ వినోద్, మహిళా అధ్యక్షురాలు సంగీతారెడ్డి, డివిజన్ అధ్యక్షుడు షేక్ రియాజుద్దీన్, నాయకులు షన్ను, కాలనీ జనరల్ సెక్రటరీ రాధా, కాలనీవాసులు వెంకటయ్య, రాజిరెడ్డి వెంకటరాజు, మహేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!