జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రిని పరామర్శించిన టియుడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు. సిహెచ్. శ్రీనివాస్
నమస్తే భారత్ :-కురవి
మహబూబాబాద్ జిల్లా కురవి మండలానికి చెందిన జర్నలిస్ట్ దేవేందర్ నాయక్ తండ్రి బానోత్ సక్రాంనాయక్ మహబూబాబాద్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న టియుడబ్ల్యూజే (ఐజేయూ) మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ ఆసుపత్రికి వెళ్లి సక్రాంనాయక్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు.అనంతరం వైద్య ఖర్చులకు అండగా రూ.3,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని శ్రీనివాస్ తెలిపారు.



