ePaper
Thursday, October 1, 2026
ePaper
Homeఎడిటోరియల్మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ నిర్వహణ

మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ నిర్వహణ

📰 Generate e-Paper Clip

మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ నిర్వహణ

నమస్తే భారత్ :-మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా స్థాయి పీఎం SHRI పాఠశాలల మాక్ పార్లమెంట్ కార్యక్రమాన్ని బుధవారం మహబూబాబాద్ ఐ .డి .ఓ .సి . కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం G. ఉపేందర్ రావు పర్యవేక్షణలో నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీమతి స్నేహ శబరీష్ మరియు ఇన్‌చార్జ్ డి ఈ ఓ శ్రీ రాములు హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. పార్లమెంటరీ విధానంలో ప్రభుత్వ నిర్వహణ, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థలో విద్యార్థుల పాత్ర వంటి అంశాలపై వారు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మాక్ పార్లమెంట్ ద్వారా విద్యార్థులు పార్లమెంటరీ విధానం, సభా నిర్వహణ, చర్చా పద్ధతులు, ప్రజాస్వామ్య ప్రక్రియలను ఆచరణాత్మకంగా తెలుసుకునే అవకాశం పొందారు.ఈ కార్యక్రమంలో సోషల్ స్టడీస్ ఫోరమ్ ఉపాధ్యాయులు అంజుమ్ సుల్తానా, బోడ యాకూబ్, బ్రహ్మానంద రెడ్డి, నాగరాజుతో పాటు ఇతర సామాజిక శాస్త్ర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్పృహ, నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత పౌరసత్వ భావనలను.పెంపొందించడంలో ఈ మాక్ పార్లమెంట్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!