మరిపెడ పీహెచ్‌సీలో లెప్రసీ వ్యాధిపై అవగాహన శిక్షణ

నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (పీహెచ్ ) స్థానిక వైద్యాధికారి డాక్టర్ రవి ఆధ్వర్యంలో గురువారం లెప్రసీ (కుష్టు) వ్యాధిపై ప్రత్యేక అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లెప్రసీ ట్రైనింగ్ సెంటర్ టీం జాయింట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై. సుష్మ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వై. సుష్మ లక్ష్మి మాట్లాడుతూ, సమాజంలో కుష్టు వ్యాధి పట్ల ఉన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి ఆరోగ్య సిబ్బందిపై ఉందన్నారు. వ్యాధి లక్షణాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. అనంతరం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశాలు.ఏఎన్ఎం.లు,ఎమ్ ల్ హెచ్. పి లు మరియు పిడిఎమో సూపర్‌వైజర్లకు లెప్రసీ వ్యాధి ప్రధాన లక్షణాలు, అనుమానితులను గుర్తించే విధానం మరియు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన సర్వే ప్రక్రియపై సమగ్ర శిక్షణ ఇచ్చారు.ఈ శిక్షణా కార్యక్రమంలో డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్, డీపీఎంవో శ్రీనివాస్ రెడ్డి, లౌర్దమ్మా, పీహెన్ మంగమ్మ, మరియు స్థానిక ఎమ్ ల్ హెచ్.పి.లు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



