సీఎం వ్యాఖ్యలకు నిరసన

నమస్తే భారత్ :-మరిపెడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మరిపెడ మండలంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కో-కన్వీనర్ అలవాల శ్రీధర్ ఆధ్వర్యంలో రామాలయం, శివాలయాలను సందర్శించి సీఎం రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కన్వీనర్లు గర్రెపల్లి నగేష్, జనార్దన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



