జి పి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు యాదయ్య పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దుల జంగయ్య
నమస్తే భారత్ షాద్ నగర్, ఆగస్ట్ 07:కొందుర్గు మండల పరిధిలోని చిన్న ఉమ్మెత్తల గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న జిపి వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులుటాక్టర్ డ్రైవర్ యాదయ్య పై అకారణంగా దాడి చేసిన కబీర్ భూషయ్యా కబీర్ వీరేశంలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా
ప్రధాన కార్యదర్శి
బుద్ధుల జంగయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న సందర్భంగా సహకరించేది పోయి వ్యక్తిగత కారణాలతో దూషించడం దాడి చేయడం గాయపరచడం సరైనది కాదు అని ఆయన
అన్నారు పంచాయతీ
కార్మికులు ఉంటేనే గ్రామపంచాయతీలు పరిశుభ్రంగా ఉంటాయని వారే లేకుంటే ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందని అది గమనించుకోవాల్సిన అవసరం గ్రామీణ ప్రజానీకానికి ఎంతైనా ఉందని ఆయన సూచించారు అధికారులు కూడా పంచాయతీ కార్మికుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని అది మానుకోవాలని అధికారులు నాయన కోరారు ముట్పూర్ గ్రామంలో కూడా పంచాయతీ కార్మికుడు ముక్కిడి శీను పై ఇలాంటి ఘటన నేజరిగిందని పంచాయతీ పరిధిలో మాట్లాడి పరిష్కరించారని ఆయన పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు పంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ పనులు చేయడానికి ఉన్నారు కానీ వ్యక్తిగతమైన పనులు చేయడానికి కాదు అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు మరోసారి పంచాయతీ కార్మికులపై దాడులు చేసిన దౌర్జన్యం చేసిన తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు తప్పవని ఆయన హెచ్చరించారు బ్యాగరీ యాదయ్య
జిపి యూనియన్ మండల అధ్యక్షులుతలపై బలమైన గాయం అయిందని ఆయన కోల్కోడానికి సమయం పడుతుందని కావున కోల్కు కున్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులు యాదయ్యకు సెలవుతో కూడినవేతనంతో
పాటు వైద్య ఖర్చులు అన్నీ కూడా భరించాలని ఆయన డిమాండ్ చేశారు గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ కొందుర్గు మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో
స్థానిక పోలీస్ స్టేషన్లో జందార్ శ్రీనివాస్ గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి భాగాల నరసింహ జిపియూనియన్ మండల గౌరవ అధ్యక్షులు గోపి గడ్డ యాదయ్య మండల ప్రధాన కార్యదర్శి పామిడి జంగయ్య ప్రచార కార్యదర్శి చింతలపల్లి జంగయ్య ఉపాధ్యక్షులు సి యాదయ్య ఎం యాదయ్య తదితరులు పాల్గొన్నారు.



