సీకేఏం కళాశాలకు డాక్టర్ ధర్మారెడ్డి అందించిన సేవలు శ్లాఘనీయం

వరంగల్ జూన్ 30(నమస్తే భారత్ ) : గత 36 ఏళ్లుగా సీకేఎం కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్ గా పనిచేసి ఉన్నత విద్యా రంగానికి ఆచార్య ఆండ్రు ధర్మారెడ్డి అందించిన సేవలు ఎంతో శ్లాఘనీయమని వక్తలు కొనియాడారు. దేశాయిపేట లోని సీకేఏం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ డాక్టర్ ధర్మారెడ్డి పదవీ విరమణ సమావేశండాక్టర్ షేక్ అయేషా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకతీయ యూనివర్సిటీ మాజీ రిజిస్ట్రార్ విశ్రాంతాచార్యులు జగన్నాధ స్వామి మాట్లాడుతూ డాక్టర్ ధర్మారెడ్డి నిరంతరo శ్రమిస్తాడని నిబద్ధతకు నిలువుటద్దమని తెలిపారు. నా శిష్యుడుగా మంచి పరిశోధకుడిగా ఎదిగి ఉత్తమ అధ్యాపకుడిగా సేవలందించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ టి. సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సీకేఏం కళాశాల అధ్యాపకుడిగా పాఠాలు చెప్పడంతో పాటు ఎన్నో సామాజిక సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు. పదవీ విరమణ అనంతరం ధర్మారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్ ధర్మారెడ్డి తో అనుబంధం ఉన్న పలువురు విశ్రాంత ప్రిన్సిపాళ్ళు , అధ్యాపకులు గుర్తుచేసి అభినందించారు. చివరగా సన్మాన గ్రహీత డాక్టర్. ధర్మారెడ్డి మాట్లాడుతూ మారుమూల కుగ్రామం నుండి రైతు కుటుంబం నుండి వచ్చి కష్టపడి చదువుకున్న నాకు సీకేఏం కళాశాల తనకు జీవితాన్ని అందించిందని అందుకు నేను సర్వదా రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కళాశాలలో సీనియర్ విశ్రాంత అధ్యాపకులు స్వర్గీయ జానకిరామయ్య , సుబ్బారావు,విశ్రాంతాచార్యులు జగన్నాధస్వామి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ సోమిరెడ్డి తదితరుల స్పూర్తితో బోధనతో పాటు సామాజిక సమస్యలు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానని తెలిపారు. తన 36 ఏళ్ల ప్రస్థానం లో తన ఎదుగుదలకు కృషిచేసిన తల్లిదండ్రులు, బంధు మిత్రులు అందరికీ డాక్టర్ ధర్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డాక్టర్ ధర్మారెడ్డి ని శాలువ, జ్ఞాపికలు, ప్రశంస పత్రం అండ జేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ పాలకమండలి సభ్యులు చందా శ్రీకాంత్, సీకే ఏం కళాశాల పూర్వ అధ్యాపకుల సహకార సంఘం అధ్యక్షుడు డాక్టర్ సుదర్శనరెడ్డి, పూర్వ ప్రిన్సిపాళ్ళు డాక్టర్ శశిధర్ రావు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్ళు లెఫ్ట్నెంట్ బి. చంద్రమౌళి , ఆచార్య మల్లం నవీన్, ఆచార్య జి శ్రీనివాస్, ఆచార్య సంతోష్, కెప్టెన్ డాక్టర్ పి సతీష్ కుమార్ ,డాక్టర్ చిన్న , శ్రీనివాస్, జ్ఞానేశ్వర్, పాషా, వివిధ కళాశాలల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు ఎన్సిసి క్యాడెట్లు ,తదితరులు పాల్గొన్నారు.



