ePaper
Thursday, July 2, 2026
ePaper
Homeఎడిటోరియల్విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి.

విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి.

📰 Generate e-Paper Clip

విబి జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలి.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి.

కేంద్ర ప్రభుత్వ రైతు, కూలీ వ్యతిరేక విధానాలకు నిరసన.. సెక్రటరీలకు వినతిపత్రం..

నమస్తే భారత్: భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో (మూర్తి)

మణుగూరు:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏఐఏడబ్ల్యూయూ , సీఐటీయూ , ఏఐకేఎస్ ఆధ్వర్యంలో నాయకులు మణుగూరు మండలంలోని గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టి వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం అమలు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసి పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయానికి ఎరువుల సబ్సిడీలను పునరుద్ధరించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రైతులు, వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి అనుకూలంగా తక్షణ చర్యలు చేపట్టాలని, లేకుంటే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల నాగమణి, రైతు సంఘం జిల్లా నాయకులు బొల్లం రాజు ,సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొడిశాల రాములు, కోండ్రు గౌరీ , సున్నం మల్లేష్ ముడుసు భాగ్యమ్మ, కోసం కళ్యాణి, చీమల మల్లయ్య సీఐటీయూ, ఏఐకేఎస్ నాయకులు, రైతులు, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!