ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం: కొలన్ హన్మంత్ రెడ్డి.

-మహాదేవపురం ఎస్ ఐ ఆర్ హెల్ప్ డిస్క్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి
-బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా ఓటరు నమోదు చేపట్టాలని సూచన
-ఓటరు జాబితాలో పొరపాట్లకు తావులేకుండా ఖచ్చితమైన వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం
-18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువత కొత్త ఓటరుగా నమోదు కావాలని పిలుపు
-ఎన్యుమరేషన్ ఫారమ్‌లను సక్రమంగా నింపి సమర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి
-ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని వ్యాఖ్య
కుత్బుల్లాపూర్, జులై 13 ( నమస్తే భరత్ ); కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 277వ డివిజన్ మహాదేవపురం పరిధిలోని దేవేందర్ నగర్‌లో గాజులరామారం సర్కిల్ ఏ ఈ ఆర్ ఓ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) హెల్ప్ డిస్క్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటరు నమోదు ప్రక్రియను బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా, నిష్పాక్షికంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఓటరు జాబితాలో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా ఖచ్చితమైన వివరాలతో నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కోరారు. ప్రజలు కూడా బీఎల్ఓలు అందజేసే ఎన్యుమరేషన్ ఫారమ్‌లను పూర్తిస్థాయిలో నింపి సకాలంలో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని కొత్త ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కు అని పేర్కొన్న హన్మంత్ రెడ్డి, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు కావడం సామాజిక బాధ్యత అని అన్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేసి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిద్ధునోళ్ల సంజీవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి గణేష్, ఐఎన్‌టీయూసీ నాయకుడు డేగుల సతీష్ బాబు, లలిత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



