చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయం.తొలిముద్ద కార్యక్రమం ప్రారంభం
సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి,
అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ సోమల నాయక్,
ఉపసర్పంచ్ షరీఫ్
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో, మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ పరిధిలోని అబ్బాయిపాలెం సెక్టార్ అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఉప్మా, కిచిడీ వంటి అల్పాహారాన్ని అందించడం ప్రారంభించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదల, పోషకాహార లోపం నివారణ, శారీరక–మానసిక వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు సూచించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా సీనియర్ నాయకులు ఒంటికొమ్ము యుగంధర్ రెడ్డి, అబ్బాయిపాలెం గ్రామ సర్పంచ్ సోమల నాయక్, ఉపసర్పంచ్ షరీఫ్, గ్రామపంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో చిన్నారులకు అల్పాహారం వడ్డించి, వారితో ఆప్యాయంగా ముచ్చటించారు.



