ePaper
Saturday, October 3, 2026
ePaper
Homeఎడిటోరియల్గ్యమా తండా అంగన్వాడీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

గ్యమా తండా అంగన్వాడీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

గ్యమా తండా అంగన్వాడీలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

వార్డు కౌన్సిలర్ గుగులోతు నీల లచ్చిరామ్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు గ్యమా తండా అంగన్వాడీ కేంద్రంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి వార్డు కౌన్సిలర్ గుగులోతు నీల లచ్చిరామ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు అల్పాహారం తినిపించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి అంగన్వాడీ కేంద్రాలు చేస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!