ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న స్విమ్మర్ రాజు
ఖానాపురం సెప్టెంబర్ 21( నమస్తే భారత్ ) :
వరంగల్ పోలీస్ కానిస్టేబుల్, బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు) రక్తదానంలో ఉత్తమ సేవా పురస్కారం అందుకున్నారు.వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రాగంపేటకు చెందిన కన్నె కుమారస్వామి – రమనీల దంపతుల పెద్ద కుమారుడు వరంగల్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న ఎ.ఆర్ 2009 బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ బ్లడ్ డోనర్ అండ్ బ్లడ్ మోటివేటర్ కన్నె రాజు (స్విమ్మర్ రాజు)కు యాదాద్రిభువనగిరి జిల్లా, ఆత్మకూర్ మండలం పి.యస్ ఫంక్షన్ హాల్ లో భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ రంగాలలో సేవాలందిస్తున్న రక్తదాతలకు – సమాజ సేవకులకు, ఉపాధ్యాయులకు ఉత్తమ సేవా పురస్కారం – 2026 అందడం జరిగింది.గత 21 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రక్తదానం పై నేను స్వయంగా 38 సార్లు రక్తదానం చేశాను.అత్యవసర సమయంలో ఉన్న పేషెంట్లకు రక్తదాతల సహకారంతో 18,832 మందికి ఉచితంగా రక్తం అందించడం, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 86 రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, కరోనా (కోవిడ్ – 19) సమయంలో 235 మందికి ప్లాస్మాదానం చేయించడం, దాతల సహకారంతో 430 రోజులు అన్నదాన కార్యక్రమలు నిర్వహించడం, వీటితోపాటు విద్యాభివృద్ధి, వివిధ అంశాల పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, ఆర్థిక సహాయం, అవయవదానం పై అవగాహన మొదలైన కార్యక్రమాలు చేయడం.ముఖ్యంగా రక్తదానం పై 21 సంవత్సరాలుగా నేను చేస్తున్న సేవలను గుర్తించి భారత్ రక్తదాన్ సేవా మిషన్ అసోసియేషన్ అధ్యక్షులు కురుమేటి నవీన్, ప్రధాన కార్యదర్శి హేమంత్ ఈ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ బ్లడ్ డోనర్ డాక్టర్ సంపత్ కుమార్, సామాజిక కార్యకర్త సర్వ్ నీడ్ ఆర్గనైజర్ డాక్టర్ గౌతమ్ కుమార్, యంగ్ ఇండియా బ్లడ్ డోనర్స్ అధ్యక్షులు జే.బి బాలు గారి చేతుల మీదుగా ” రక్తదానంలో ఉత్తమ సేవా పురస్కారం – 2026″ ను తీసుకోవడం జరిగింది. నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ, నన్ను అనునిత్యం ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులు, నా యొక్క బందుమిత్రులు, రక్తదాతలు, యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులు, గురువులు, రాగంపేట గ్రామ ప్రజలకు, మరియు పోలీసు ఉన్నతాధికారులకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవార్డును అందరికీ అంకితం చేస్తున్నాను.



