ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeఎడిటోరియల్అన్నం పరబ్రహ్మ స్వరూపం.. భక్తులకు అన్నప్రసాదం

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. భక్తులకు అన్నప్రసాదం

📰 Generate e-Paper Clip

అన్నం పరబ్రహ్మ స్వరూపం.. భక్తులకు అన్నప్రసాదం

నర్సప్పగూడ గంగానగర్ కాలనీలో బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

పెద్ద సంఖ్యలో పాల్గొన్న గ్రామ పెద్దలు, యువత, మహిళలు

నమస్తే భారత్ షాద్ నగర్ సెప్టెంబర్21:నర్సప్పగూడ అన్నం పరబ్రహ్మ స్వరూపమనే భావనతో గణేష్ ఉత్సవాల సందర్భంగా నర్సప్పగూడ గ్రామంలోని గంగానగర్ కాలనీలో బాల గణేష్ మండపం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు కట్న శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గణనాథుని దర్శించుకున్న భక్తులకు నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో అన్నప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గణేష్ ఉత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని చాటుతున్నామని నిర్వాహకులు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో గంగానగర్ కాలనీలో సందడి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!