ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఎడిటోరియల్July 14న  రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ విజయవంతం_ABVP

July 14న  రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ విజయవంతం_ABVP

📰 Generate e-Paper Clip

*July 14న రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ విజయవంతం_ABVP.*

 

నమస్తే భరత్,, 14/7/2026/ నారాయణపేట జిల్లా

*వెంటనే పెండింగ్ లో ఉన్న11,000కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేయాలి.*

 

*విద్యా శాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి.*

 

*తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న11,000కోట్ల పైగా ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల బకాయిలు విడుదల చేయాలని ABVP రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ కు పిలుపునివ్వగా మఖ్తల్,మాగనూరు, కృష్ణ ,నర్వ మండలాలో అన్ని కళాశాల బంద్ విజయవంతం చేయడం జరిగిందని ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్ కుమార్ తెలిపారు.రేవంత్ రెడ్డి మనవడికి ఏమో పూరీలు పెట్టి తినిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులుగా ఉన్న మనవడి లాంటి వాళ్లకు తినడానికి విడుదల చేయాల్సిన మెస్ ఫీజులు,చదువుకోడానికి అవసరం అయ్యే ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజులు విడుదల చేయలేకపోవడం నిజంగా బాధాకరమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయ్యిన విద్యార్థులకు రావాల్సిన రియాబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడం విద్యార్థుల పట్ల ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ల గతంలో కూడా బకాయిలను విడుదల చేయకపోవడం తో రెండు జూనియర్ కళాశాలలు ఒక డిగ్రీ కళాశాల కూడా మూత పడిన సందర్భాలు మఖ్తల్ లో జరిగాయని అన్నారు. ఈ విధంగా స్కాలర్షిప్ పథకానికి బకాయిలను చేయడం వలన రేపటి నాడు ఆ యొక్క స్కాలర్షిప్ పథకాన్ని ఎత్తి వేయాలనే కుట్ర కు తెర లేపారేమో అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు. SC,ST,BC విద్యార్థులకు స్కాలర్షిప్,ఫీజ్ రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతో ఉపయోగం ఉందని అలాంటి వాటిని విడుదల చేయకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదని సకాలంలో స్కాలర్సిప్ విడుదల కాకపోవడంతో అనేక మంది విద్యార్ధులకు సర్టిఫికేట్ అందక నిరుద్యోగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ABVP తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త కాలేజీల బంద్ లో ప్రైవేట్ యాజమాన్యాలు, ప్రభుత్వ యాజమాన్యాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు సహకరించి బంద్ ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలోమఖ్తల్ నగర కార్యకర్తలు సందీప్,నాని,మూర్తి,అరవింద్,చక్రి,నవీన్,మాయ, అక్షయ్ మాగనూరు మండల కన్వీనర్ సాయి కిషోర్ గౌడ్,నవీన్ మధు మహేష్ అక్షయ్ ఆకాష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.*

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!