ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeఎడిటోరియల్వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు

వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు

📰 Generate e-Paper Clip

వెంకటేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించిన కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు

ఖానాపురం, అక్టోబర్ 5 (నమస్తే భారత్ ) :

వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండల కాకతీయ కమ్మ సంఘం అధ్యక్షులు కొరిటాల వెంకటేశ్వరరావు కొద్ధిరోజుల క్రితం అనారోగ్యంతో అకాల మృతి చెందారు. కాగా సోమవారం ఖానాపురంలో బాధిత కుటుంబ సభ్యులను తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘాల సమాఖ్య కమిటీ కార్యదర్శి గంగవరపు రామకృష్ణ ప్రసాద్, కమిటీ ఈసీ మెంబర్ వడ్డే చిరంజీవి పరామర్శించారు. అనంతరం వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈకార్యక్రమంలో వరంగల్ జిల్లా కమ్మ సంఘం మాజీ అధ్యక్షులు మందడపు కోటేశ్వరరావు, కమ్మ సంఘం జిల్లా సెక్రటరీ వెంకటకృష్ణ, కొల్లి అనిల్, నర్సంపేట కమ్మ సంఘం ఉపాధ్యక్షులు బండారుపల్లి చెంచారావు, చెరుకూరి ప్రసాద్, కోశాధికారి పాలడుగు వెంకటేశ్వరరావు, ఖానాపురం కాకతీయ కమ్మ సంఘం మాజీ అధ్యక్షులు దేవినేని వెంకటప్రసాద్, కొమ్మినేని మోహన్ రావు, మండవ శివ ప్రసాదరావు, దేవినేని వేణు కృష్ణ, ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు వల్లభనేని కిరణ్, ప్రధాన కార్యదర్శి పరిటాల రామారావు, సహాయ కార్యదర్శి గోగినేని శ్రీను, కోశాధికారి వేములపల్లి రామ్మోహన్ రావు, కమ్మ కుల బాంధవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!