మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన
ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మున్సిపల్ చైర్పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
నమస్తే భారత్ :-మరిపెడ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ఆర్కావత్ సీత ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రామచంద్రనాయక్ మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయనతో పాటు మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, సీత మృతికి సంతాపం తెలిపారు.
ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఐలమల్లు, టౌన్ అధ్యక్షుడు పానుగోతు రాంలాల్, కౌన్సిలర్లు జాటోతు సురేష్, జియో రమేష్, గంట్ల గౌతమ్ రెడ్డి, గుండగాని వేణు తదితరులు పాల్గొన్నారు.



