ఖానాపురంలో జమ్మి మొక్క ప్రతిష్టాపన చేసిన సర్పంచ్
ఖానాపురం జూన్ 17( నమస్తే భారత్ ) : ఖానాపురం మండల కేంద్రం ఖానాపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ దాసరి రమేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి ఖానాపురం రైతు వేదిక వద్ద “జమ్మి మొక్క” ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా శమీ వృక్షం ప్రాధాన్యతను గుర్తుచేశారు.
జమ్మి చెట్టు మన సంస్కృతికి, ఆచారాలకు ప్రతీక. శ్రీరాముడు అజ్ఞాతవాసం వెళ్లే ముందు, పాండవులు అజ్ఞాతవాస ఆయుధాలను దాచింది జమ్మి చెట్టు కిందనేనన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలని గ్రామస్తులకు పిలుపునిచ్చారు.హరితహారం లక్ష్యసాధనకు ఇది మనందరి బాధ్యత” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు ఉప సర్పంచ్ ఉప్పు రాజు, వార్డు సభ్యులు వేములపల్లి వెంకట ప్రసాద్ రావు,గుండ్లపల్లి విజయ్, చలిగంటి మల్లికార్జున్,గ్రామ పెద్దలు బొబ్బ విద్యాసాగర్ రావు,బోడ దేవా, మచ్చిక అశోక్, నంద్యాల వినయ్ రెడ్డి, రెడ్డి నాగార్జున రెడ్డి, మేడిద కుమార్, కోయగూర కుమార స్వామి, వేముల వెంకటేశ్వర రావు, కొత్తపల్లి వెంకటేశ్వర్లు,మర్రి రామస్వామి, పరుచూరి నరేంద్ర, వీరమళ్ళ శ్రీనివాస్, యాకయ్య, మల్యాల పోశెట్టి, భూక్య నవీన్, పల్నాటి శ్రీనివాస్,దాసి శ్రీనివాస్, యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొని మొక్కకు నీళ్లు పోశారు.



