ePaper
Saturday, September 19, 2026
ePaper
Homeతెలంగాణవాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన

వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన

📰 Generate e-Paper Clip

వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలి: ఆటో డ్రైవర్లకు సూచన

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా రవాణా అధికారి శంకర్ నాయక్ ఆదేశాల మేరకు మరిపెడ మండలంలో శుక్రవారం ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఆటోలను నడిపే సమయంలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్సూరెన్స్ తదితర ధ్రువపత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. వాహనానికి సంబంధించిన పత్రాలను ఎప్పటికప్పుడు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు.డ్రైవింగ్ చేస్తున్న సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, అతివేగం, ఓవర్‌లోడింగ్‌కు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రయాణికుల సామర్థ్యానికి మించి వ్యక్తులను ఎక్కించుకోకుండా నిబంధనలకు అనుగుణంగా ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లాలని సూచించారు.
అలాగే మద్యం సేవించి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘించడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. వాహనం బ్రేకులు, టైర్లు, లైట్లు తదితర ముఖ్యమైన భాగాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలని, రాత్రివేళల్లో వాహన లైట్లు సక్రమంగా పనిచేస్తున్నాయో నిర్ధారించుకోవాలని తెలిపారు.
ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించడంతో పాటు, రహదారిపై ఇతర వాహనదారుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని ఆటోలను నడపాలని సూచించారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు సహకరించాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఖాసీం సాహెబ్, సహాయ మోటార్ వాహన తనిఖీ అధికారి, విజయ శాంతి, సహాయ మోటార్ వాహనాల తనిఖీ అధికారి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!