ఓటరు జాబితా సవరణ మనందరి బాధ్యత

చింతల్ డివిజన్‌లో ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో మహ్మద్ రఫీ పిలుపు
-అర్హులైన ప్రతి ఒక్కరూ గణన పత్రాలను తప్పనిసరిగా సమర్పించాలి
-నిర్ణీత గడువులోపు బూత్ స్థాయి అధికారికి వివరాలు అందజేయాలి
-ఓటరు జాబితాలో పేరు నమోదు ప్రజాస్వామ్య హక్కు: మహ్మద్ రఫీ
-ఓటరు జాబితా సవరణపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం
-చంద్రానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి విశేష స్పందన
– కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు
కుత్బుల్లాపూర్, జూలై 27 ( నమస్తే భరత్ ): ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది వంటిదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు అయ్యేలా బాధ్యతగా వ్యవహరించాలని మహ్మద్ రఫీ పిలుపునిచ్చారు. చింతల్ డివిజన్ పరిధిలోని చంద్రానగర్‌లో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన హక్కు అని పేర్కొన్నారు. అర్హులైన ఓటర్లందరూ తమ గణన పత్రాలను పూర్తిగా నింపి, నిర్ణీత గడువులోపు సంబంధిత బూత్ స్థాయి అధికారికి అందజేయాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హత ఉన్న ఏ ఒక్కరి పేరు కూడా జాబితాలో లేకుండా ఉండకూడదని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం తమ వివరాలను సరిచూసుకొని అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెహెర్ ఉన్నీసా బేగం, రాములు, సాంబరాజు, నర్సింహా గౌడ్, హరి ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, సత్యనారాయణ, సూర్యప్రకాశ్, శంకర్, భాస్కర్ రెడ్డి, మహబూబ్, షబ్బీర్, సుశీల, మేఘమాల, విద్యాసాగర్, భాస్కర్, పాండరంగం, బూత్ స్థాయి అధికారులు శ్రీశైలం, అస్లం, ఉమామహేశ్వరి, విద్య, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.



