ePaper
Saturday, July 18, 2026
ePaper
Homeఎడిటోరియల్అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం

నమస్తే భారత్ :-తొర్రూర్

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 25న జరగనున్న కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని కోరుతూ, తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలొ సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో సంతాప సభ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ తొర్రూరు డివిజన్ కార్యదర్శి ఊడుగుల లింగన్న మాట్లాడుతూ, కామ్రేడ్ అరుణోదయ నాగన్న మరణంతో ప్రజా గొంతుక మూగవైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసి, గిరిజన, దళిత పేదరికం దరిద్రం నిర్మూలనకైమహిళలపైజరుగుతున్న దాడులను కళారూపాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వారిని చైతన్యపరిచిన గొప్ప ప్రజా కళాకారుడని కొనియాడారు.గోదావరి పరివారక ప్రాంతంలో ప్రతిఘటన పోరాటానికి తన విశేష కృషి ఉందని, ఆ ఉద్యమాల్లో ప్రజలను ఏకం చేస్తూ కీలక పాత్ర పోషించారని తెలిపారు. గోదావరి ప్రతిఘటన పోరాట ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.కళాకారుడిగానే కాకుండా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎదిగి చిన్ననాటి నుండి చివరి వరకు ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ నిలబడటం ఆయన ప్రత్యేకత అని అన్నారు.ప్రజా గాయకుడు అంటే నాగన్నలాగా ఉండాలి” అని, నాగన్న త్యాగం నేటితరం యువతకు దిక్సూచిగా, కళాకారులకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. అందరూ భారీగా పాల్గొని సంతాప సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చిర్రాయ కన్న నక్క యాకన్న దొనకే ఎల్లయ్య రాములు చంద్రయ్య యకమ్మరాజయ్య, భూలక్ష్మి చంద్రయ్య సోమయ్య, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!