సాయిబాబా కాలనీ అంగన్వాడి స్కూల్ లో పోషణ్ అభియాన్ అవగాహన సదస్సు


నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్03:షాద్ నగర్ లోని సాయిబాబా కాలనీ అంగన్వాడి స్కూల్లో మరియు పటేల్ రోడ్డు అంగన్వాడి స్కూల్లో , రెండు సెంటర్లలో పోషన్ అభియాన్ గురించి గర్భిణీ స్త్రీలకు, బాలంత లకు మరియు కిషోర్ బాలికలకు పోషకాహార లోపాల గురించి హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు అవగాహన కల్పించారు. పోషణ్ అభియాన్ అనేది భారత ప్రభుత్వం ప్రారంభించిన ‘ *జాతీయ పోషకార ఉద్యమం’* ఇది పిల్లలలో పోషకాహార లోపం, తక్కువ బరువు , ఎదుగుదల లోకం తగ్గించడం ; గర్భిణీలకు, బాలింతలకు సరైన పోషకాహారం అందేలా అవగాహన కల్పించడం; రక్తహీనత తగ్గించేందుకు చర్యలు చేపట్టడం; తల్లి పాలు, అనుబంధ హారం మరియు పరిశుభ్రతపై అవగాహన పెంచడం; పోషకాహారం పై కుటుంబాలకు సమాజంలో ప్రవర్తనాల్లో మార్పు తీసుకురావడం పోషణ్ అభియాన్ యొక్క ప్రధాన లక్ష్యం అని హెల్త్ ఎడ్యుకేటర్ జె.శ్రీనివాసులు చెప్పారు.
*ముఖ్యమైన పోషణ సందేశాలు*
1). ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అని,
2). ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు వైవిధ్యమైన అనుబంధ ఆహారం ప్రారంభించాలి అని,
3). ఆకుకూరలు పప్పులు, గుడ్లు, పాలు కూరగాయలు పండ్లు వంటి పోస్తారని తీసుకోవాలని,
4). గర్భిణీలు వైద్యుల సూచన మేరకు ఐరన్ పోలిక యాసిడ్ వంటి సప్లమెంటు తీసుకోవాలని,
5). చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన నీరు మరియు పరిసరాలను పరిశుద్ధత ఉంచుకోవడం పోషణం యొక్క ముఖ్య సందేశాలని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు చెప్పారు.
*పోషకాహారం* పోషకాహారం అంటే మన శరీరానికకి అవసరమైన శక్తి, ఎదుగుదల, రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యాన్ని అందించే వివిధ రకాల ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోవడం జె.శ్రీనివాసులు చెప్తారు. అంటే మనం తీసుకునే నిత్యం హారపాలలో కార్బో హైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు మరియు పీచు పదార్థం వంటి ఆహార పదార్థాలు రెగ్యులర్గా తీసుకోవడం అని హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి వైద్యాధికారి డాక్టర్ రాధిక, హెల్త్ ఎడ్యుకేటర్ జే. శ్రీనివాసులు, ఏ.ఎన్.ఎమ్. కౌసర్ బేగం, కవిత , అంగన్వాడి టీచర్లు ప్రసన్న , పి.జయమ్మ ఎల్. పద్మ , పి.భారతి, రాధా, ఆశలు మరియు గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు కిషోర్ బాలికలు పాల్గొన్నారు.



