బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జేజమ్మని కలిసిన ఉట్కూర్ మరియు నర్వ మండల బీజేపీ సర్పంచులు
నమస్తే భారత్,, 3/10/2026/ నారాయణపేట జిల్లా
సర్పంచుల ఎన్నికలు జరిగి సంవత్సరం కావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వమ్ గ్రామాల అభివృద్ధికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని, మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డీకే అరుణమ్మ గారి నిధులద్వారా సీసీ రోడ్లు, వాటర్ ప్లాంట్లు, హైమాస్ లైట్లు మంజూరు చేయించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి గారిని కోరగా తక్షణమే స్పందించిన లక్ష్మికాంత్ రెడ్డి గారు మహబూబ్నగర్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలయానికి తీసుకెళ్లి జేజమ్మ గారితో ముఖాముఖిగా మాట్లాడించి వీలైనంత త్వరగా మీ ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరగా, స్పందించిన అరుణమ్మ గారు త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
ఇట్టి కార్యక్రమంలో నర్వ మండల బీజేపీ అధ్యక్షులు శ్రీ అజిత్ సింహా రెడ్డి గారు, బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ శ్రీ పేట లలితా వెంకట్ రెడ్డి గారు, దిశా మెంబెర్ శ్రీ కిరణ్ గారు, బిజ్వార్ సర్పంచ్ శ్రీ అంజయ్య గారు, మొగదుంపూర్ సర్పంచ్ శ్రీ తిరుమలేష్ గారు,కొత్తపల్లి సర్పంచ్ శ్రీ నర్సిమ్మ గారు, పెద్దజేట్రం సర్పంచ్ శ్రీ వెంకటేష్ గారు, లంకల్ ఉపసర్పంచ్ శ్రీ విజయ్ రామ్ గారు, శ్రీ శ్రీధర్ శెట్టి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, వెంకటేశ్వర్ రెడ్డి గారు,బిజ్వార్ శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు,పాతపల్లి శ్రీ వెంకటేష్ గారు, మొగదింపుర్ శ్రీనివాస్ గారు,పులిమామిడి శ్రీ విజయన్ గౌడ్ గారు, శ్రీ కృష్ణ గారు మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.



