బీసీల భారీ బహిరంగ సభ ను విజయ వంతం చేయండి

షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తాలూకా చైర్మెన్ జాంగారి రవి
నమస్తే భారత్ షాద్ నగర్ అక్టోబర్ 03:బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు కల్పించాలనే డిమాండ్ తో ఈనెల 4 వ తేదీన సాయంత్రం 4 గంటలకుశంషాబాద్, గొల్లపల్లి రోడ్ లో నిర్వహిస్తున్న ఓబీసీల భారీ బహిరంగ సభకు షాద్ నగర్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని బిసిలకు సంఘీభావం తెలపాలి అని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్ జాంగారి రవి కోరారు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాద్ నగర్ ఎస్సీ విభాగం నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారుఈ సందర్భంగా షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మెన్ జాంగారి రవి మాట్లాడుతూ బీసీల ఐక్యతకు -సామాజిక న్యాయ సాధనకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం తరుపున అందరం కలిసి సభను విజయవంతం చేద్దాం అని జాంగారి రవి తెలిపారు అనంతరం ఎస్సీ విభాగం చైర్మెన్ గా ఎన్నికైన జాంగారి రవిని చౌల పల్లి గ్రామ సర్పంచ్ జంగయ్య, అన్నారం గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మండలాల అధ్యక్షులు చిన్న చినోళ్ళ శివ కుమార్,పెంటనోళ్ళఆంజనేయులు,గోపని భిమయ్య, గునుగుర్తి రాజశేఖర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్లు సాయిలు,చిన్న ఎలికి చర్ల గ్రామ సర్పంచ్ మారాటీ రాజ్ కుమార్, చౌలపల్లి గ్రామ సర్పంచ్ జంగయ్య, అన్నారం లావణ్య రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కరోల్ల యాదయ్య, ఎస్సీ విభాగం నేత గడ్డం జంగయ్య, చౌదరిగూడ మండల నాయకులు గట్టుపల్లి రాజు, యాదగిరి, అప్ప రెడ్డి గూడ కృష్ణ, బాలరాజు, వై బాబు తదితరులు పాల్గొన్నారు.



