ePaper
Friday, August 21, 2026
ePaper
Homeఎడిటోరియల్షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

📰 Generate e-Paper Clip

షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

జీవో నంబర్‌ 97ను రద్దు చేయాలని డిమాండ్‌.. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాలని విజ్ఞప్తి

97జీవో ను వెంటనే రద్దు చేయాలి

మహబూబాబాద్ సీఐ రఘుపతి రెడ్డిని తక్షణ సస్పెండ్ చేయాలి

డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం అందజేత

ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ డిమాండ్

నమస్తే భారత్ షాద్ నగర్ ఆగస్ట్ 20:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ షాద్‌నగర్‌ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట విద్యార్థులు,విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసే విధానాలను తీసుకురావడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని విద్యార్థిని కావ్య శ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.ఎస్ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ.,, తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో తమ పిల్లలను పాలిటెక్నిక్‌ కళాశాలల్లో చేర్పిస్తున్నారని అన్నారు. మూడేళ్ల డిప్లొమా పూర్తిచేసిన అనంతరం ఈసెట్‌ ద్వారా ఇంజనీరింగ్‌లో చేరి ఉన్నత విద్యను అభ్యసించాలన్నది విద్యార్థుల లక్ష్యమని తెలిపారు. అయితే వారిని ప్రభుత్వ రంగ ఉద్యోగాలకు దూరం చేసే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.యంగ్‌ ఇండియా స్కిల్స్‌ పేరుతో పాలిటెక్నిక్‌ విద్యార్థులను కేవలం నైపుణ్య కార్మికులుగా చూడటం సరికాదని శ్రీకాంత్‌ అన్నారు. విద్యార్థుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను గుర్తించి ఇంజనీరింగ్‌, ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరారు. రైల్వే, డీఆర్ఓ వంటి ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను తగ్గించి విద్యార్థులను కేవలం కార్మికులుగా మార్చే విధానం సరైంది కాదన్నారు.
*పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి*
పాలిటెక్నిక్‌ విద్యను బలహీనపరచకుండా అవసరమైన అధ్యాపకులు, సిబ్బందిని నియమించాలని, కళాశాలలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. షాద్‌నగర్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సరైన భవనం, వసతులు, సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలకు బదులుగా శాశ్వత భవనాలను నిర్మించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపకులు, సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
శక్తి పాలసీని రద్దు చేయాలి
పాలిటెక్నిక్‌ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలను నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన పేరుతో ఇతర విభాగాల పరిధిలోకి మార్చే ప్రతిపాదనలు విద్యార్థుల్లో ఆందోళనకు కారణమవుతున్నాయని ఎస్ఎఫ్‌ఐ నాయకులు అన్నారు. దీనివల్ల పాలిటెక్నిక్‌ డిప్లొమా విద్యకు ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలను అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు.జీవో నంబర్‌ 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్‌ విద్యను బలోపేతం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని ఎస్ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్‌ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!