ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఎడిటోరియల్చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న

📰 Generate e-Paper Clip

చిన్నారుల ఆరోగ్యమే లక్ష్యంగా ఉల్లేపల్లిలో తొలి ముద్ద కార్యక్రమంలో పాల్గొన్న

గ్రామ సర్పంచి ఎన్ కాలమ్మ
ఉప సర్పంచ్ వెంకన్న

అంగన్వాడి టీచర్స్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఉల్లేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మరిపెడ ప్రాజెక్ట్ ఐసీడీఎస్ ఉల్లేపల్లి సెక్టార్‌కు చెందిన ఉల్లేపల్లి అంగన్వాడీ కేంద్రాలు 1, 2, 3లో తొలి ముద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉల్లేపల్లి సర్పంచ్ ఎన్ కళమ్మ. ఉప సర్పంచ్ వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులకు తొలి ముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించి, వారికి అందిస్తున్న పౌష్టికాహారం, అల్పాహారం గురించి వివరించారు.సర్పంచ్ ఎన్ కళమ్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందిస్తున్న బ్రేక్‌ఫాస్ట్, పౌష్టికాహారం ఎంతో ఆరోగ్యకరమైనదని అన్నారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అభినందనీయమన్నారు.
తొలి ముద్ద కార్యక్రమం ద్వారా చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చిన్ననాటి నుంచే పెంపొందించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు కూడా అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎన్ కళమ్మ వెంకన్న ఉప సర్పంచ్ వెంకన్న మాజీ సర్పంచ్ సిహెచ్ ప్రభాకర్ ఏఎన్ఎం తులసి ఆశా రేణుక లింగయ్య. పానుగంటి మునేందర్ రెడ్డి గ్రామ పెద్దలు లబ్ధిదారుల మరియు అంగన్వాడీ టీచర్లు, లక్ష్మి. కాంతమ్మ. శ్రీలత.ఆయాలు, రుక్కమ్మ. జ్యోతి. విజయలక్ష్మి.చిన్నారులు, తల్లిదండ్రులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!