ePaper
Sunday, October 4, 2026
ePaper
Homeఎడిటోరియల్అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన సర్పంచ్ గుగులోతు కాంతమ్మ

అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన సర్పంచ్ గుగులోతు కాంతమ్మ

📰 Generate e-Paper Clip

అంగన్వాడి కేంద్రంలో బ్రేక్ ఫాస్ట్ ను ప్రారంభించిన

సర్పంచ్ గుగులోతు కాంతమ్మ

ఉప సర్పంచ్ బొడ్డు నాయక్ గూగుల్ రామ్ లాల్

నమస్తే భారత్ :-మరిపెడ

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో వెంకటియ్య తండా అంగన్వాడి సెంటర్ లో పోషణ్ అభియాన్ – పోషణ మాసం కార్యక్రమాన్ని విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గుగులోతు కాంతమ్మ ఉపసర్పంచి బొడ్డు నాయక్ గూగుల్ రామ్ లాల్ గ్రామ కార్యదర్శి మరియు గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి గుగులోతు కాంతమ్మ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు నిర్వహిస్తున్న పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా మహిళలు, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు మరియు కిశోర బాలికలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, వ్యక్తిగత శుభ్రత, సమతుల్య ఆహారం వంటి అంశాలపై అంగన్వాడి టీచర్ గుగులోతు కవిత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబంలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు, మహిళల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచవచ్చని అన్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందించడం తల్లిదండ్రుల బాధ్యత అని, ఆరోగ్యకరమైన ఆహార పు అలవాట్లను చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!