ePaper
Sunday, August 9, 2026
ePaper
Homeఎడిటోరియల్మరిపెడ కాంగ్రెస్‌కు కొత్త సారథులు మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

మరిపెడ కాంగ్రెస్‌కు కొత్త సారథులు మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

📰 Generate e-Paper Clip

మరిపెడ కాంగ్రెస్‌కు కొత్త సారథులు మండల, పట్టణ అధ్యక్షుల నియామకం

నమస్తే భారత్ :-మరిపెడ

కాంగ్రెస్ పార్టీ నూతన మండల, పట్టణ అధ్యక్షుల పేర్లను శుక్రవారం విడుదల చేశారు. పీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు, డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ భుక్యా ఉమా మురళి నాయక్ ఆమోదంతో డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించారు.
డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నూతనంగా నియమితులైన అధ్యక్షులు సమన్వయంతో పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.ఇందులో భాగంగా మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుగులోత్ రవి నాయక్, మరిపెడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బానోత్ రామ్‌లాల్, చిన్నగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎం. వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.నూతన అధ్యక్షులు గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం సూచించింది. నూతనంగా నియమితులైన నాయకులకు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!