బాచుపల్లిలో ఘనంగా ‘మదర్ సాల్’ కార్యక్రమం
మత సామరస్యం
– సోదరభావానికి ప్రతీకగా వేడుకలు
-కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు
-ఐక్యత, శాంతి సందేశాన్ని చాటిన ముస్లిం సోదరులు
-అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలని పిలుపు
-గ్రామాభివృద్ధికి సామాజిక ఐకమత్యమే బలమని అభిప్రాయం
-మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల విస్తృత భాగస్వామ్యం
-మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన బాచుపల్లి కార్యక్రమం
బాచుపల్లి, ఆగస్టు 7 ( నమస్తే భరత్ ): బాచుపల్లి గ్రామంలో ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో నిర్వహించిన “మదర్ సాల్” (మదర్సా) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటువంటి మత, సామాజిక కార్యక్రమాలు సమాజంలో సోదరభావం, ఐక్యత, పరస్పర గౌరవం, శాంతియుత వాతావరణాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కుల, మత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా జీవించడం ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రజలంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కొలన్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచులు సుధాకర్, సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షుడు కొలన్ జీవన్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షుడు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సీతారామ్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్, బిక్కన్ షా, కొలన్ యుద్ధం రెడ్డి, గోపాల్ రెడ్డి, జనార్దన్, ఎస్.డి. సాలీమ్, ఎస్.డి. సాలీమ్ అక్బర్, ఫారూఖ్, చాంద్, అక్బర్, ఖాజా, శంకర్ రెడ్డి, జీతూ మాధవ్ రెడ్డి, సి.హెచ్. జీతయ్య, కె. జీతయ్య, ఆగం శంకర్, వెంకటేష్, ఉదం రెడ్డి, జి. శ్రీను తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





