ఈనెల16న పోచమ్మతల్లి బోనాల పండుగ
ఖానాపురం ఆగష్టు8 (నమస్తే భారత్ ) :
ఖానాపురం మండల కేంద్రంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పణ మహోత్సవం ఈనెల16న అదివారం నిర్వహించుటకు సర్పంచ్ సమక్షంలో గ్రామ కుల పెద్ధలు నిర్ణయించారు.ఖానాపురం మండల కేంద్రంలో శ్రావణ మాసంలో సమర్పించే పోచమ్మ తల్లికి బోనాలు మహోత్సవ కార్యక్రమం ఈనెల 16 ఆదివారం నిర్వహిస్తున్నట్లు గ్రామ కుల పెద్దలతో కలిసి సర్పంచ్ దాసరి రమేష్ ప్రకటించారు.
కావున భక్తులు తల్లికి సమర్పించే బోనాలు నైవేద్యం తీసుకొని రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కుల పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.



