ePaper
Monday, August 3, 2026
ePaper
Homeఎడిటోరియల్పాఖాలకు దేవాదుల నీటీ పంపింగ్ ను పరిశీలించిన నాయకులు

పాఖాలకు దేవాదుల నీటీ పంపింగ్ ను పరిశీలించిన నాయకులు

📰 Generate e-Paper Clip

పాఖాలకు దేవాదుల నీటీ పంపింగ్ ను పరిశీలించిన నాయకులు

ఖానాపురం ఆగష్టు3 (నమస్తే భారత్) :

పాకాల చెరువుకు సాగునీటి విడుదల పనులను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
పాఖాల ఆయకట్టు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేస్తారని ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు.నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవ రెడ్డి ఆదేశాల మేరకు దేవాదుల ప్రాజెక్టు నుంచి రామప్ప , డబ్బా వాగు ద్వారా రెండు మోటార్ల సహాయంతో పాకాల చెరువుకు నీటిని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.కాగా గొల్లపల్లి – దబ్బీర్పేట సమీపంలోని పంప్ హౌస్‌ను కాంగ్రెస్ నాయకులు సందర్శించి నీటి పంపింగ్ ను పరిశీలించారు.రాష్ట్రంలో నెలకొన్న ఎల్-నినో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీటి కొరత రాకుండా, పాకాల చెరువు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు.ఈకార్యక్రమంలో ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నర్సంపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శాఖమూరి హరిబాబు, ఖానాపురం సోసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ యాదవ్ , నర్సంపేట ఆత్మ చైర్మన్ ఎడ్ల బిక్షం రెడ్డి, దబ్బీర్పేట సర్పంచ్ సురేష్, కిరియా తండా ఉప సర్పంచ్ సుమన్, మంగళవారిపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్, శాఖమూరి ముఖేష్, పిండి కుమార్, ఖానాపురం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండవ ప్రసాదరావు, పేరబోయిన కుమారస్వామి, కార్తీక్, మధుకర్, తాళ్లకొమ్ములు, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!