ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్యువతపై లాఠీ ఛార్జ్ అమానుషం..!

యువతపై లాఠీ ఛార్జ్ అమానుషం..!

📰 Generate e-Paper Clip

యువతపై లాఠీ ఛార్జ్ అమానుషం..!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

– కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య

నమస్తే భారత్ :-మరిపెడ

ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి కార్యక్రమానికి వచ్చిన యువత, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం, ఘర్షణలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కెవిపిఎస్ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య తీవ్రంగా ఖండించారు.
మంగళవారం మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నీట్ సహా పలు పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమం నిర్వహించగా, పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసులు లాఠీచార్జ్, బాష్పవాయు ప్రయోగం చేయడంతో పలువురు విద్యార్థులు, తోపాటు పోలీసు సిబ్బంది కూడా గాయపడినట్లు తెలిపారు. ఢిల్లీలో నిరసనకారులపై బలప్రయోగం చేశారని, మహిళా విద్యార్థులపై సైతం మగ పోలీసులు తీవ్రంగా దాడి చేయడం చట్ట విరుద్ధమని.ఆరోపిస్తున్నారు.గత కొన్ని వారాలుగా జంతర్‌మంతర్ వద్ద పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షకు మద్దతుగా యువత పెద్దఎత్తున ఉద్యమంలో పాల్గొంటున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న యువతతో ప్రభుత్వం చర్చలు జరపకుండా బలప్రయోగానికి దిగడం బాధాకరమని అన్నారు.దేశ భవిష్యత్తైన యువత ఉద్యోగాలు, పారదర్శక పరీక్షల నిర్వహణ, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించాలని
కోరుతూ పోరాడుతుంటే వారి సమస్యలను.పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కే చర్యలకు పాల్పడడం సరైన విధానం కాదన్నారు. విద్యార్థుల ఆందోళనలకు ప్రజాస్వామ్యబద్ధమైన పరిష్కారం చూపాలని, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికైనా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!