ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 641 ను...

సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 641 ను రద్దు చేయాలి

📰 Generate e-Paper Clip

*సిద్ధాపూర్ లో డంపింగ్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 641 ను రద్దు చేయాలి*

*రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం పై పోరాడేందుకు సమాయత్తం.*

*ఈ డంపింగ్ యార్డు ను వ్యతిరేకించే వారందరూ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి.*

*సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ.*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై21 :రంగారెడ్డి జిల్లా కొత్తూరు సిద్దాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 641 జీవో ను రద్దు చేయాలని సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ వ్యతిరేక జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై 02 వ తేదీ నాడు సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయటం కోసం 641 జీవో ను తీసుకువచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ…. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విడి విడిగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాయి.. ఇలా ఈ అంశంపై విడి విడిగా కాకుండా ఐక్య పోరాటం కొరకు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, అనంతరం అన్ని పార్టీలు , ప్రజా, కుల సంఘాలను కలుపుకుని ముందుకు వెళ్లాలని జరిగిన సమావేశంలో అందరి నిర్ణయం మేరకు ” సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ” ని ఎన్నుకోవడం జరిగింది.. ఈ “సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ” మొదటి సమావేశం మంగళవారం నాడు షాద్ నగర్ దేవి గ్రాండ్ హోటల్ నందు చైర్మన్ రాంబాల్ నాయక్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కమిటీ లో చిన్న మార్పులు చేస్తూ తీర్మానం చేశారు. అనంతరం ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం కోసం భవిష్యత్ కార్యాచరణ కోసం విస్తృతంగా చర్చించారు.. ముందుగా ఈ కమిటీ డంపింగ్ యార్డ్ వల్ల నష్ట పోతున్న గ్రామాలు మరియు మండలాల కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ ప్రజలను ప్రత్యక్ష కార్యాచరణ కోసం సమాయత్తం చేయాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ చైర్మన్ రాంబాల్ నాయక్ మాట్లాడుతూ.ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో, కూరగాయల సాగుతో హైదరాబాద్ మహానగరానికి అన్నం పెట్టిన ఆ పల్లె సీమలు నేడు విష వాయువుల కోరల్లో చిక్కుకుంటాయి అని, స్వచ్ఛమైన గాలి, మంచినీటితో ప్రశాంతంగా సాగుతున్న జనజీవనం అస్తవ్యస్తం అవుతుందన్నారు.. ఈ డంపింగ్ యార్డు వల్ల ఒక సిద్ధాపూర్ గ్రామమే కాదు చుట్టు పక్కల సుమారు 30 కిలో మీటర్ల మేర అన్ని ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తీరని అన్యాయం తప్ప ఉపయోగం లేదన్నారు. కనుక ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిద్ధాపూర్ డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ *సలహా దారులు* వంగూరి గంగి రెడ్డి, అబ్దుల్ రబ్ జామి, *వర్కింగ్ చైర్మన్* దొడ్డి శ్రీనివాస్ (బీఎస్పీ), *కన్వీనర్* పినపాక ప్రభాకర్ (కార్మిక నేత), *కో ఆర్డినేటర్లు* తిరుమలయ్య (పౌర హక్కుల సంఘం), టీజీ శ్రీనివాస్ (టీయూ జేఏసీ), *కో-చైర్మన్లు* సత్యనారాయణ (బిఆర్ఎస్ ), మోహన్ సింగ్ (బీజేపీ) , బుద్దల జంగయ్య (సీపీఐ), ఈశ్వర్ నాయక్ (సిపిఎం), పెంటనోళ్ల నరసింహ (ఎమ్మార్పీఎస్), బొజ్జ శ్రీనివాస్ రెడ్డి (సిద్ధాపూర్) , బాలస్వామి (సిద్ధాపూర్) , రజిత (ఖాజా గూడ తండా) , *కో-కన్వీనర్లు* అర్జున్ప (టిపిఎఫ్) , రవీంద్రనాథ్ (పీఏసీ) , ప్రశాంత్, (బీసీ జన సేన), వి శ్రీకాంత్ (ఎస్ఎఫ్ఐ) , పవన్ (ఏఐఎస్ఎఫ్ఐ) , సత్యనారాయణ (పీపీ జాక్ ) , వర ప్రసాద్ (బీసీ సేన) , బిత్యా నాయక్ (ఎల్ఎచ్పిఎస్) , మరియు శ్రీధరా చారి (సిద్దాపూర్) తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!