ePaper
Wednesday, November 11, 2026
ePaper
Homeఎడిటోరియల్భూ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి –

భూ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి –

📰 Generate e-Paper Clip

భూ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి –

జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, నవంబర్ 11,భూ రీసర్వే ప్రక్రియలో ప్రతి రైతుకు సంబంధించిన భూములను క్షేత్రస్థాయిలో కచ్చితంగా గుర్తించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లి గ్రామంలో చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును, రైతుల భూముల హద్దుల గుర్తింపు ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి రైతుకు చెందిన భూమి సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించి, భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సర్వే నిర్వహణకు కనీసం 24 గంటల ముందుగానే సంబంధిత గ్రామంలోని పట్టాదారులకు నోటీసులు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏ రోజు, ఏ సమయంలో, ఏ ప్రాంతంలో సర్వే నిర్వహించనున్నారనే వివరాలను ముందుగానే రైతులకు తెలియజేయాలని, నోటీసులు అందించిన వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. సర్వేకు హాజరైన రైతులతో పాటు, నోటీసులు అందించినప్పటికీ హాజరుకాని పట్టాదారుల వివరాలను కూడా నమోదు చేయాలన్నారు.సర్వే నంబర్ల ప్రాతిపదికన మాత్రమే కాకుండా రైతుల వారీగా భూములను గుర్తించి హద్దులు నిర్ధారించాలని తెలిపారు. ప్రతి రైతుకు చెందిన భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన చోట ఫ్లాగ్‌లు ఏర్పాటు చేసి, రైతులకు భూమి సరిహద్దులను ప్రత్యక్షంగా చూపిస్తూ వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని సూచించారు. సర్వే పూర్తయిన అనంతరం భూమి విస్తీర్ణం, సరిహద్దులు, ఇతర వివరాలను కచ్చితంగా నమోదు చేసి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే వివరాలకు, రెవెన్యూ రికార్డుల్లోని వివరాలకు మధ్య వ్యత్యాసాలు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలన్నారు.భూ రీసర్వే ప్రక్రియపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ సర్వేలో ప్రతి అంశాన్ని పారదర్శకంగా వివరించాలని కలెక్టర్ సూచించారు. రైతుల సమక్షంలోనే భూముల హద్దులను నిర్ధారించడం ద్వారా సర్వే ప్రక్రియపై వారిలో విశ్వాసం కల్పించాలన్నారు. సర్వే బృందాలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గ్రామాలకు చేరుకుని, సంబంధిత రైతులకు ముందస్తు సమాచారం అందిస్తూ సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే నిర్వహణలో నిర్లక్ష్యం, తొందరపాటు నిర్ణయాలు, తప్పిదాలకు ఏమాత్రం తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. భూ రీసర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు రైతులు, గ్రామస్థులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం తహశీల్దార్ సునీత, సర్వేయర్లు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!