బంధుత్వాలకు ప్రేమ ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలి

ఆశ్రమం బాపూజీ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాలలో పూజా కార్యక్రమాలు
నమస్తే భారత్ ప్రతినిధి, రాజేంద్రనగర్, నవంబర్ 11, బంధుత్వాలకు ప్రేమ ఆప్యాయతలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశ్రమం బాపూజీ నిర్వాహకులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో బుధవారం చెల్లెలి ఇంటికి అన్న వచ్చి భోంచేసే కార్యక్రమం ఈరోజు ఎంతో శుభదినం అని ఈ సందర్భంగా గొల్లపల్లిలోని ఆశ్రమం బాపూజీ నిర్వాహకులు శ్రీయోగ్ వేదాంత సేవా సమితి జేసురాజ్ బాలాపూర్, అశోక్, దీపక్ పటేల్, శృతి రెడ్డి ఆధ్వర్యంలో శంషాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు ఆప్యాయతలకు అనురాగాలకు నిదర్శనంగా విద్యార్థులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ కార్యక్రమాన్ని విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం విద్యార్థినీ విద్యార్థులు కూడా చక్కగా పాల్గొని సోదరీ సోదర భావాలకు, బంధుత్వాలకి, ఆప్యాయతలకి,అనురాగాలకి నిదర్శనంగా నిలిచారు. ఆశ్రమం బాపూజీ నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థుల్లో సోదర భావాన్ని,ఐక్యత భావాన్ని, పెంపొందిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.



