*ప్రభుత్వ పాఠశాల(శ్రామిక బడి ) విద్యార్థుల కు స్టీల్ ప్లేట్లు బహుకరణ.*
నమస్తే భారత్ షాద్ నగర్,నవంబర్11:మున్సిపల్ 5 వ వార్డు ఎంపీ శేఘయ్య నగర్ కమ్యూనిటీ హాల్ లో నడుస్తున్న శ్రామిక బడి పిల్లలకు పౌల్ట్రీ రైతు మండవ మురళి సహకారంతో భోజన ప్లేట్లురందజేసిన పాతూరి వెంకటరావు. షాద్ నగర్ ఎంఈవో మనోహర్ ఆధ్వర్యంలో పౌల్ట్రీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలను బడిబాట కార్యక్రమంలో భాగంగా సుమారు 70 మంది నీ గుర్తించి , ప్రముఖ పౌల్ట్రీ పారిశ్రామిక వేత్త పాతూరి వెంకటరావు సహకారంతో పౌల్ట్రీ కమ్యూనిటీ హాల్ లోనే విద్యార్థులకు బడి నీ ఏర్పాటు చేసి ఒక విద్యా వాలంటీర్ కి స్వయంగా వేతనం అందిస్తున్నారు.. ఈ క్రమంలో మధ్యాహ్నం భోజనం చేయడం కొరకు మండవ మురళి సహకారంతో స్టీల్ ప్లేట్లను అందించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత పినపాక ప్రభాకర్, టీచర్ లు సత్యం, చంద్రశేఖర్ లు పాల్గొన్నారు.



