ePaper
Tuesday, August 11, 2026
ePaper
Homeఎడిటోరియల్విద్యార్థుల తలలు పగలగొట్టడమే బిజెపి లక్ష్యమా..!

విద్యార్థుల తలలు పగలగొట్టడమే బిజెపి లక్ష్యమా..!

📰 Generate e-Paper Clip

*విద్యార్థుల తలలు పగలగొట్టడమే బిజెపి లక్ష్యమా..!*

*కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.!*

*ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్.!*

*షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారీ ర్యాలీ.!*

*భగత్ సింగ్ వారసులుగా ప్రాణాలు పోయినా పోరాడుతాం..!*

నమస్తే భారత్ షాద్ నగర్ జులై21:దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద నీట్ -యూజీ పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ మరియు విద్యార్థి సంఘాల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే ఆ విద్యార్థులపై బిజెపి ప్రభుత్వం ధమనకాండ ప్రయోగించి లాఠీ ఛార్జ్ చేసి విద్యార్థుల తలలు పగలగొట్టడం బాష్ప వాయువు ప్రయోగించి విద్యార్థులను అణచివేయడం దేనికి నిదర్శనమని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ప్రయోగించి విద్యార్థుల తలలు పగలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎంతమంది విద్యార్థులపై లాఠీచార్జి చేసిన విద్యార్థి ఉద్యమం ఆగదని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నీట్ -యూజీ ప్రశ్న పత్రాల లీకేజీలో బాధ్యత వహిస్తూ వెంటనే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!