ePaper
Wednesday, July 22, 2026
ePaper
Homeఎడిటోరియల్సికేఎం నందు అతిథి అధ్యాపకులుగా పని చేయుటకు దరఖాస్తులు చేసుకోండి

సికేఎం నందు అతిథి అధ్యాపకులుగా పని చేయుటకు దరఖాస్తులు చేసుకోండి

📰 Generate e-Paper Clip

సికేఎం నందు అతిథి అధ్యాపకులుగా పని చేయుటకు దరఖాస్తులు చేసుకోండి

కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య

వరంగల్ జులై21 (నమస్తే భారత్ ) :

సికేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2026 – 27 విద్యా సంవత్సరంలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి. పోశయ్య తెలిపారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ కంప్యూటర్ సైన్స్ -2 ,ఇంగ్లీష్ -2 ,హిందీ ఒకటి హిస్టరీ -1 ,మ్యాథమెటిక్స్ – 1 , ఫిజిక్స్ -1 ,,పొలిటికల్ సైన్స్ -1 , పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -1, తెలుగు -1 , జువాలజీలో -1 , చొప్పున పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.~ఓసి, బిసి అభ్యర్థులు అయితే 55% మార్కులతో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు ఎంపికలో పి హెచ్ డి, నెట్, సెట్ అర్హత బోధన అనుభవం కలిగి వారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 23న సాయంత్రం నాలుగు గంటలలోగా అందజేయాలన్నారు.దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వారికి సమాచారం అందించి ఎంపిక ప్రక్రియ చేపడతామని తెలిపారు. పూర్తి వివరాల కోసం సి కె ఎం కళాశాల నందు సంప్రదించగలరని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!